
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బాయిల్డ్ రైస్ మిల్లులో మట్టిని తరలిస్తున్న ఓ టిప్పర్ అన్లోడ్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి కింద పడింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే జేసీబీ సహాయంతో టిప్పర్‌ని పైకి లేపారు.