
బైక్ అదుపుతప్పి బ్రిడ్జి డివైడర్‌ను ఢీకొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన తాడ్వాయి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బయ్యక్కపేట గ్రామానికి చెందిన సమ్మయ్య మరో వ్యక్తితో కలిసి బైక్‌పై సరుకులు తేవడానికి నార్లపూర్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశత్తూ డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు తెలిపారు.