పెరగనున్న ట్రేడ్ లైసెన్స్ టాక్స్.. వ్యాపారులపై భారం

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 మునిసిపాలిటీలలో భారీగా ట్రేడ్ లైసెన్స్ టాక్స్ పెరగనున్నాయి. కౌన్సిల్లో నిర్ణయించిన ప్రకారం ట్రేడ్‌ లైసెన్సుల రుసుం నిర్దారణకు స్వస్తి చెప్పనున్నారు. సింగిల్‌, డబుల్‌ రోడ్లు, మల్టీ లేన్ల రోడ్లు ప్రాతిపదికన టాక్స్ విధించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అసలే కరోనాతో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు మొదలైన వేళ, ఇలా పెంచడం సరికాదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.