వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ చైర్మన్

టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నూతన అధ్యక్షుడుగా నియమితులైన ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ని హైదరాబాద్ మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.