టీడీపీకి బిగ్‌ షాక్‌.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే హైమావతి

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. చాలా మంది కీలక లీడర్లు.. టీడీపీని వదిలేసి.. ఫ్యాన్‌ గూటికి చేరారు. ఇక తాజాగా తెలుగు దేశం పార్టీకి మరో ఊహించని షాక్‌ తగిలింది. ఇవాళ వైసీపీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి చేరారు. సీఎం జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు హైమవతి.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ మహిళా అధ్యక్షురాలు హైమవతి మాట్లాడుతూ.. అన్నింట్లో మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వటం అభినందనీయమని చెప్పారు. జగన్ మహిళా పక్షపాతి అని.. మహిళలను ఆర్ధికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తున్న కృషి చూసి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయటానికి క్షేత్ర స్థాయిలో కృషి చేస్తానని.. మొదటి సారి సీఎంను కలిశానని హైమావతి ఎమోషనల్‌ అయ్యారు. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా ఆప్యాయంగా, అభిమానంగా మాట్లాడారని ఆమె వెల్లడించారు.