పాలకులు చెప్పే మాటలను లైట్ తీసుకోవద్దు… పరిస్థితి భయంకరం…!

-

సామాజిక దూరం, లాక్ డౌన్ ఇప్పుడు ఎక్కువగా మనం వింటున్న పదాలు. ప్రపంచం మొత్తం ఈ పదాలనే ఎక్కువగా వింటుంది. అన్ని దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత చాలా దారుణంగా ఉంది. అందుకే చాలా దేశాలు పాక్షికంగా పూర్తిగా లాక్ డౌన్ ని ప్రకటించి ప్రజలు ఎవరిని కూడా బయటకు రాకుండా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇప్పుడు ఇదే విధంగా చేస్తున్నాయి.

- Advertisement -

అంటే కరోనా విషయం ఏ స్థాయిలో అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. దయచేసి ఎవరూ కూడా పాలకులు చెప్పే మాటలను లైట్ తీసుకోవద్దు. లాక్ డౌన్ అనే నిర్ణయం మీరు అనుకునే అంత చిన్నది కాదు. దేశాల భవిష్యత్తు… ఆందోళనకరం గా ఉంటుంది. తెలంగాణా సిఎం కేసీఆర్ ఒక మాట అన్నారు. 24 వేల కోట్లు వచ్చే ఆదాయం… ఇప్పుడు కేవలం 6 కోట్లకు పడిపోయింది అని.

హైదరాబాద్ ఉన్న తెలంగాణా ఆ స్థాయిలో ఆదాయం పడిపోయింది అంటే… ఏ మాత్రం అభివృద్ధి లేని ఉత్తరాది రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, ఓడిస్సా, చత్తీస్ఘడ్, హర్యానా పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుంది…? ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే… ఇప్పుడు మన దేశం కూడా ప్రాణాల కోసం చాలా వరకు పోరాటం చేస్తుంది. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా అనవసరంగా బయటకు రావొద్దు. ఒక్కసారి మన దేశంలో కేసులు 50 వేలు దాటాయి అంటే పరిస్థితి అధ్వాన్నం.

అభివృద్ధి చెందిన దేశాలే ఇప్పుడు మందుల కొరతతో నరకం చూస్తున్నాయి. అమెరికా లాంటి దేశం, ఇటలీ లాంటి ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న దేశం కూడా ఇప్పుడు పౌరులను కాపాడుకోలేక అవస్థలు పడుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా సరే మన దేశంలో వైద్యం కొరత ఎక్కువగా ఉంది. గ్రామ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోకపోతే గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుని పోయినా ఆశ్చర్యం లేదు.

మీడియా హెచ్చరికలను, పాలకుల హెచ్చరికలను లైట్ తీసుకుని లాక్ డౌన్ ని ఎత్తివేయాలని మీరు కోరినా పరిస్థితి అదుపు దాటింది అంటే బిక్కు బిక్కుమంటూ బతకాలి. కరోనా వైరస్ ఇప్పుడు కాకులకు, జంతువులకు కూడా వస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. మనం గనుక జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే నష్టపోవడం ఖాయం. ఇప్పుడు రోగులకు మందుల కొరత లేదు. భవిష్యత్తులో రోగుల సంఖ్య పెరిగింది అంటే పరిస్థితి అధ్వాన్నం… ఊహకు కూడా అందని విధంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...