గబ్బిలం నుంచి కరోనా ఎలా బయటకు వస్తుందో చూడండి…!

-

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించే అందరి ఆలోచనలు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎంతటి నివారణ చర్యలు చేపడుతున్న కూడా ఈ వైరస్ ను కట్టడిచేయడం సాద్యపడటం లేదు. ఈ వైరస్ నివారించేందుకు మందును కనిపెట్టే పనులలో కొందరు నిమగ్నమై ఉంటే, మరికొందరు అసలు ఈ కరోనా వైరస్ ఎలా పుట్టింది, ఎక్కడ నుంచి పుట్టింది అనే విషయాన్ని తెలుసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు.

కరోనా గబ్బిలాల వల్ల వచ్చిందని కొందరు, పాముల వల్ల వచ్చిందని మరికొందరు, ఇవి రెండూ కాదు పాంగోలిన్ (ఆలుగు) వల్ల వచ్చిందని ఒకరు ఇలా ఒక్కొకరిలో ఒక్కో అభిప్రాయం. కానీ ఏ ఒక్కదాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ నిరూపించలేకపోయారు. అయితే అందరూ మొదట అనుకున్నది గబ్బిలం ద్వారా వచ్చింది అని. దీనికి ఒక విశ్లేషణ కూడా ఇచ్చారు. అదేంటంటే గబ్బిలాల్లోని పేగుల్లో కరోనా లాంటి వైరస్‌లు ఉంటాయి.

గబ్బిలాల మూత్రం నుంచి ఆ వైరస్ బయటకు వస్తుంటాయి. ఇలా వచ్చిన మూత్రాన్ని గ్వానో అంటారు. ఇది గుహల్లో లభిస్తుంది. చాలా దేశాల్లో ఈ గ్వానొ ను మొక్కలకు ఎరువుగా వాడుతుంటారు. ఇలా గుహల్లోంచి గబ్బిలాల గ్వానో ను తెచ్చి పొలాల్లో వాడుతుంటే అందులోని కరోనా వైరస్ ఇద్దరు రైతులకు వ్యాపించినది అని, వారు చైనాలోని వుహాన్ రావడం వల్ల ఇతరులకు వ్యాప్తి చెందింది అనేది ఒక పరిశోధన చెబుతుంది.

ఇది నిజమా, అబద్ధమా అనేదానికి రుజువు లేదు. ఇదొక అంచనా మాత్రమే. అయితే తాజాగా కరోనా వైరస్‌ గురించి వచ్చిన మరో విశ్లేషణ చూస్తే వుహాన్ నగర వన్యప్రాణుల మార్కెట్ దగ్గర ఉన్న ఓ ల్యాబ్ నుంచి ఈ వైరస్ లీక్ అయినట్టు సమాచారం. చైనా ప్రభుత్వమే స్వయంగా ఆ వైరస్‌ ను బయోవార్ కోసం సిద్ధం చేస్తోందనీ, అయితే పొరపాటున ల్యాబ్‌లో చిన్న ప్రమాదం జరగడం వల్ల ఈ వైరస్ లీకైందని అంటున్నారు.

ఆ సమయంలో అక్కడి పరిశోధకులకు ఈ వైరస్ వ్యాపించగా వారి నుంచి వుహాన్ వన్యప్రాణుల మార్కెట్‌కు వ్యాపించిందని అంటున్నారు. అయితే వీటిలో దేనికి కూడా ఆధారాలు లేవు. ఎవరికి వారు ఈ వైరస్ ఎలా వచ్చింది అన్నదానిపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు తప్ప ఇది ఎలా వచ్చింది అనేది ఇప్పటివరకు తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Latest news