రెండు తెలుగు రాష్ట్రాలోని యవత మత్తులో చిత్తయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం విద్యార్థులే దీని పట్ల ఆకర్షితులై తమ కుటుంబాలకు శోకాన్ని మిగిలిస్తున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతకైన తెగిస్తున్నారు. డ్రగ్స్ కొనడానికి డబ్బులు లేకపోవడంతో చోరీల బాట పడుతున్నారు. ఇందులో విద్యార్థినులు సైతం బలవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మత్తుకు అలవాటైన ఓ యువకుడు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు, మరోచోట ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మత్తు కొనేందుకు చోరీలు చేసి దొంగగా మారారు.
ఓ విద్యార్థిని మత్తులో తన నగ్న చిత్రాలను అమ్మేందుకు సిద్ధమైంది. ఇలా రెండు రాష్ట్రాలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందుకు పోలీసులు తగు చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. మత్తుకు గురవుతున్న యువతను ప్రారంభ దశలోనే వారికి కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు.ఎక్కడబడితే అక్కడ గంజాయి, హెరైన్, కొకైన్, ఓపీఎం వంటి మత్తు పదర్థాలు దొరుకుతుండటంతో యువత అటువైపు పరుగులు పెడుతున్నారు. అధిక ఒత్తిడి కూడా కొందరికి వ్యసనాల బారిన పడేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇవి చేయరాదు..
1. మార్కులు తక్కువ వచ్చాయని రోజూ వారిని ఎత్తిచూపరాదు. పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకోమని సూటిపోటీ మాటలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
2. ఇలాంటి పరిస్థితులో వారి మనస్సు నిగ్రహంగా ఉండలేక వ్యసనాలకు అలవాటు పడతారు.
3. కొన్ని ఇళ్లలో రోజు కుటుంబంలో గొడవలు, ఘర్షనలు చోటుచేసుకోవంతో అవి పిల్లలపై ప్రభావం చూసి, వాటినుంచి బయటపడేందుకు కొత్తకొత్త మార్గాలను అనుసరించే క్రమంలో మత్తుకు బానిసయ్యే ప్రమాదం ఉంది.
4. కుటుంబంలోని ఎవరైన ఒకరు వ్యసనాలకు బానిసై ఉంటే ఆ ప్రభావం ఇంట్లో ఉండే పిల్లలపై చూపుతుంది.
లక్షణాలు..
పిల్లలు ఇలాంటి వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వారిలో ప్రవర్తన, మాటతీరులో మార్పు కన్పిస్తే వెంటనే మానసిక నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
1. కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇష్టపడకపోవడం, విపరీతమైన కోసం, పరిశుభ్రత పాటించకపోవడం చేస్తుంటారు.
2. చదువు మందగించడం, ఇష్టమైన ఆటలపై పట్టు కోల్పోవడం.
3. ఇంట్లో అప్పుడప్పుడు డబ్బులు, విలువైన ఆభరణాలు అపహరణకు గురవ్వడం.
4. కళ్లు ఎర్రబడటం, బరువు తగ్గిపోవడం.
5. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడటం చేస్తుంటారు.
6. ఇలాంటి సిమ్‌టమ్స్ కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.