కేసీఆర్‌ ‘ది గ్రేట్‌’.. మా ఇంటి పెద్దకొడుకు.. ఎనీ డౌట్స్‌

-

కేసీఆర్‌ తెలంగాణకు మాత్రమే నాయకుడు కాదు.. దేశానికే దిక్సూచి.. ఈ రోజు సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ చూస్తే నిజంగా అనిపిస్తుంది.. కేసీఆర్‌ లాంటి నాయకుడు దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టం. సహాయం చేసినోళ్ళని నెత్తిన పెట్టుకునే తీరు, అడ్డం వచ్చే వాళ్ళను చెండాడే ముక్కుసూటితనం.. మోడీ మాటలను గౌరవించాల్సిందేనన్న అణుకువ.. మీడియాలకు వార్నింగ్‌ ఇచ్చినా.. చచ్చిపోతాంరా అయ్యా అంటూ బ్రతిమిలాడినా ఒక్క కేసీఆర్‌ కే చెల్లుతుంది. మాటలో కఠినత్వం ఉన్నా మనసులో ఎంత ప్రేముంటుందో కనిపించింది.. అవును నిజంగానే మనకోసం మనకు ఒకడున్నాడురా అనిపించింది.

image Credits : TNEWS

మొదటి నుండి ఆయన అంతే.. ఉద్యమ సమయంలో ఒంటరిగా మిగిలినా మొక్కవోనీ పట్టుదలతో ముందుకు నడిచారే గానీ వెన్ను చూపలేదు.. తెలంగాణ ఉద్యమంతో పోలిస్తే కరోనా పెద్ద విషయమే కాదు ఆయనకు. ఏం చెయ్యాలో ఖచ్చితంగా తెలుసు.. ఎందుకు చెస్తున్నారో ఆయనకే తెలుసు.. ఆయన ఏది చేసినా మంచే.. ఇదీ కేసీఆర్‌ గురించి తెలిసిన వారి అభిప్రాయం.. ఆయనను దగ్గరి నుండి కాకుండా దూరం నుండి చూసే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు..

ఆయన పనికి ఇచ్చే గౌరవం ఇప్పటికే చాలాసార్లు చూసాం.. అడగకుండానే ఆకలి తీర్చన గొప్ప నాయకుడు.. కరోనా కష్టాల్లో కూడా పారిశద్ధ్య కార్మికులకు ఇచ్చిన గౌరవం డబ్బుతో వెలకట్టలేనిది.. ఇలాంటి సమయంలో నేనున్నాననే ధీమా చాలా ధైర్యాన్నిస్తుంది. ఇప్పుడనిపిస్తుంది కేసీఆర్‌ కాకుండా ఇంకెవరన్నా తెలంగాణను పాలిస్తే మన పరిస్థితేంటనేది..

వాస్తవాలు, భయంకరమైన పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు చాలా అవసరం. ప్రజలు కోరుకునేది వాస్తవాలనే. ఎందుకంటే జాగ్రత్త పడాలి కదా… సునామి మన ఊరు రాదు, మనకు రాదు అని అవగాహన లేకుండా మాట్లాడి, ఆ తర్వాత అది వచ్చి ముంచితే ఇబ్బంది పడేది జనమే కదా… నాయకుడు, పరిపాలకుడు, ప్రజల ప్రతినిధి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

వాస్తవాలను ప్రజలకు వివరించాలి… ధైర్యం చెప్తూనే వాళ్లకు వాస్తవాలను కఠినం గా ఉన్నా సరే చెప్పుకోవాలి. ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేది అదే. కరోనా కేసు రాష్ట్రంలో ఒకటి ఉన్నప్పుడు అయినా, ఇప్పుడు 364 ఉన్నా సరే ఆయన ఇదే విధంగా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. వాస్తవాలను చెప్తూనే ఆయన ప్రజలకు ధైర్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా మీద ఆయన మాట్లాడిన మీడియా సమావేశాలు ఇలాగే ఉన్నాయి.

ఇప్పుడు కేసీఆర్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చాలా విషయాలను ప్రస్తావించి… లాక్ డౌన్ లేకపోతే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆయన వివరించారు. లాక్ డౌన్ ఎత్తివేయవద్దు ఆర్ధికంగా అవసరం అయితే ఒక నెల రోజులు ఇబ్బంది పడాలి గాని ఇప్పుడు ఏ మాత్రం లాక్ డౌన్ విషయంలో సీరియస్ గా లేకపోయినా సరే దేశం మరో ఇటలీ అవుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లాక్ డౌన్ కొనసాగించాలి అని కేంద్రాన్ని కోరలేదు. ఆయన ఆ విషయాన్ని తెలుగులోనే కాదు.. హింది లో ఇంగ్లీష్ లో కూడా స్పష్టంగా చెప్పారు. నేను ప్రధానికి కూడా ఇదే విషయం చెప్పానన్నారు. తెలంగాణా ప్రజలు కేసీఆర్ చెప్పే ప్రతీ మాటా విన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే కేసీఆర్ ప్రసంగాన్ని యుట్యూబ్ లో ఫేస్బుక్ లో లైవ్ చూసారు. లాక్ డౌన్ కొనసాగించాలని ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పారు.

దాని వెనుక ఉన్న వాస్తవాలను కూడా ఆయన వివరించారు. లాక్ డౌన్ ఎత్తేస్తే అందరూ బయటకు వస్తారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే అవకాశం ఉంది. రైళ్ళు తిరిగితే రెండు నెలల్లో దేశం మరణ విషాదాన్ని ఎదుర్కొంటుంది. దాన్ని తట్టుకోవడం భరించడం మన వల్ల కాని పని అని స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు ఆయన తెలంగాణా సమాజానికి ఒక్కరికే చెప్పలేదు.

దేశం మొత్తానికి చెప్పారు… లాక్ డౌన్ ని భారంగా వద్దు, శిక్ష గా వద్దు బాధ్యతగా తీసుకుందాం అని కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.  ఆయన చెప్తున్న ప్రతీ మాటా కూడా ఇంటి కొడుకుగా చెప్తున్నట్టే ఉంది. చదువుకున్న వారికి అర్ధమవుతుంది చదువు లేని వారికి అర్ధమవుతుంది. లాక్ డౌన్ ని రెండు వారాలు కొనసాగించాలి అని పేర్కొన్నారు.

తెలంగాణాలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలి తో ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చెప్పలేదు. కుటుంబ సభ్యులు కూడా తమ వారికి ధైర్యం చెప్పాడానికి ఇలా మాట్లాడిన సందర్భం అనేది ఎక్కడా లేదు. ఏమవుతుంది అనుకోవద్దు, జాగ్రత్తగా ఉందామని ఆయన విజ్ఞప్తి చేసారు. లాక్ డౌన్ అనేది సాధారణ విషయం కాదు. వేల కోట్ల భారం ప్రభుత్వం ఎదుర్కోవాలి. నాకు ఆర్ధిక బలం కాదు కావాల్సింది నా సమాజం బాగుండాలి అని కేసీఆర్ చెప్పిన మాటలు ఇంటి కొడుకుగానే ఉన్నాయి. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగానే ఉన్నాయి.

– RK

 

Read more RELATED
Recommended to you

Latest news