కర్ణాటక అసెంబ్లీలో నేడు బల పరీక్ష.. పడిపోనున్న సీఎం కుమారస్వామి సర్కారు..?

415

కర్ణాటకలో గత కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేడు తెరపడేట్లే కనిపిస్తోంది. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో పడిపోయిన కర్ణాటక ప్రభుత్వం నేడు బలపరీక్షను ఎదుర్కోనుంది.

కర్ణాటకలో గత కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేడు తెరపడేట్లే కనిపిస్తోంది. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో పడిపోయిన కర్ణాటక ప్రభుత్వం నేడు బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలలోపు బలపరీక్షలో నెగ్గాలని ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఇప్పటికే సీఎం కుమారస్వామికి లేఖ రాశారు. ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో కర్ణాటక ప్రస్తుత ప్రభుత్వ భవిష్యత్తు తేలనుంది. అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనే వివరాలను ఒకసారి పరిశీలిస్తే…

cm-kumara-swamy-government-in-karnataka-might-fall-today

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 225. కాగా 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఆ సంఖ్య 210కి పడిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ సభ్యుల సంఖ్య 106గా ఉంది. అయితే కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్పీ మూడు పార్టీల సంఖ్యా బలం 103గా ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్రులు బీజేపీకి సపోర్ట్ నిస్తున్నారు. దీంతో బీజేపీ సంఖ్యాబలం 107 అవుతుంది. అప్పుడు బీజేపీకి మెజారిటీ ఉంటుంది కనుక ఆ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత కుమారస్వామి సర్కార్ పడిపోతుంది.

అయితే ఆ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఇప్పటికే కనిపించకుండా పోయారని తెలుస్తోంది. అదే జరిగితే సభలో మ్యాజిక్ ఫిగర్ 105కు చేరుతుంది. ప్రస్తుతం బీజేపీకి ఉన్న సభ్యుల బలం కూడా ఇంతే. దీంతో బీజేపీ ఎవరి మద్దతూ లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి నేటి అవిశ్వాస పరీక్షలో సీఎం కుమారస్వామి సర్కారు గట్టెక్కుతుందో, లేదో చూడాలి.