టీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్రమంత్రి తన్నీరు హరీశ్‌రావు రాజకీయాల్లో మళ్లీ యాక్వివ్ అ య్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ ఎస్ రెండోసారి అధికారం చేపట్టనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, హ రీశ్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం కల్పించారు. అంతేగాక కీలకమైన ఆర్థికశాఖ హరీశ్‌కు అప్పగించారు. దీంతో ట్రబుల్ షూటర్ మళ్లీ క్రియాశీలకంగా మారారు. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చారు. ఇదే క్రమంలో ఆయా పార్టీల్లోని పలువురు సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. తాజాగా అసెంబ్లీలో నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హరీశ్‌రావుతో భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపైనే హరీశ్‌రావును కలిసినట్లు రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. అయినప్పటికీ హరీశ్‌రావు, రా జగోపాల్‌రెడ్డి భేటీ వెనుక ఆంతర్యం ఏమిటనే అంశంపై రకరకాల చర్చలు తెరపైకి వచ్చాయి.
ఇదిలా ఉంటే, తాజాగా గురువారం అసెంబ్లీ హాల్‌లో మెదక్ జిల్లాకు చెందిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి , రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును కలవడం రాజకీయ వర్గాల్లో కలకలంరేపింది. వా స్తవానికి ఒకే జిల్లాకు చెందినప్పటికీ.. ఈ ఇద్దరి నేతల మధ్య సుదీర్ఘకాలంగా రాజకీయవైరం ఉంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత పద్నాలుగేళ్లు సంవత్సరాలుగా వీరిమధ్య మాటలు, ప లకరింపులు లేవంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ మొదలుకుని , జిల్లా పరిషత్ సమావేశాల వరకు పరస్పరం ఎదురైనా కనీసం ఒకరినొకరు కన్నెత్తి చూసుకోలేని పరిస్థితి ఉండేది.
అయితే ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీ హాల్‌లో కలుసుకోవడం , అరగంట పాటు ముచ్చటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, మెడికల్ కాలేజీకి మీ సహకారం అవసరం .. అంటూ మంత్రి హరీశ్‌రావుకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇరువురు సంభాషణలో సంగారెడ్డి అభివృద్ధికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోం ది. జ గ్గారెడ్డి విజ్క్షప్తికి హరీశ్‌రావు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఈ అంశం రాజకీయవర్గాల్లో రకరకాల చర్చకు దారితీసింది.
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. అప్పుడే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా గులాబీ కండువా కప్పకుంటారనే ప్రచారం జరిగింది. అయితే పలు కారణాల వల్ల ఆయన పార్టీ మారకుండా కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. ఇందుకు హరీశ్‌రావే కారణమని, జగ్గారెడ్డి చేరికను ఆయనే అడ్డుకున్నారని ప్రచారం జరిగింది. దీంతో సైలెంట్ అయిన జగ్గారెడ్డి తాజాగా హరీశ్‌రావుతో సమావేశం అవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మళ్లీ టీఆర్ ఎస్‌లోకి వెళ్లేందుకు జగ్గారెడ్డి పావులు కదుపుతున్నారా.. అందుకోసమే హరీశ్‌రావును కలిశారా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా రెండ్రోజుల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావుతో భేటీ కావడంపై ఆపార్టీలో విస్తృత చర్చకు దారితీసింది.