మనలోకం వార్నింగ్; అమ్మా నాన్నని కాపాడుకోండి…!

-

ఏమో నాకు కరోనా అంటే భయంగా ఉంది. తెలియని భయం నన్ను వెంటాడుతుంది. వార్తలు చదువుతుంటే ఏదో అలజడి లోపల. చిన్న చిన్న పిల్లలు, ఇంటి పెద్ద దిక్కులకు కరోనా వైరస్ వస్తుంది. వేగంగా వ్యాపిస్తుంది కరోనా వైరస్. అత్యంత వేగంగా మన జీవితాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ప్రపంచం తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ దాని దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు.

అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా చాలా వేగంగా వస్తుంది. అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తుంది. ఇక్కడ నా కుటుంబాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఆవును నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడానికి నేను సిద్దమయ్యాను. ఎక్కడ ఏముందో నాకు తెలియదు. నా అమ్మా నాన్నను నేను కాపాడుకోవాలి. నా అమ్మమ్మ, నా తాతయ్య ఇలా ఎందరో వయసు మీద పడిన వాళ్ళు నా ఇంట్లో ఉన్నారు.

వాళ్ళను కాపాడుకోవాలి ఇప్పుడు నేను. వాళ్ళను రక్షించుకోవాలి ఇప్పుడు నేను. కాబట్టి నేను బయటకు వెళ్ళను. నా అమ్మా నాన్నను బయటకు వెళ్ళనివ్వకుండా చూస్తాను. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన అమ్మా నాన్నను కాపాడుకోవడం నా బాధ్యత. కాబట్టి వాళ్ళకు ఏ ఆరోగ్య సమస్య రాకుండా చూసుకోవాలి నేను. నా నాన్నకు ఎప్పుడో పెద్ద సమస్య వచ్చింది. బయటపడ్డారు… అమ్మకు ఏదో ఉంది ఉంది.

నేను ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళను ఇబ్బంది పెట్టలేను. కాబట్టి మీరు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళను ఇబ్బంది పెట్టవద్దు అని మనలోకం కోరుకుంటుంది. మహా అంటే పది రోజులు ఇంట్లో ఉంటే చాలు కదా…? కాబట్టి ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళను కాపాడుకుందాం. మన నవ్వులు కాపాడుకోవాలి. మన జీవితాలను కాపాడుకోవాలి. అది వస్తే వదిలిపెట్టదు.

Read more RELATED
Recommended to you

Latest news