కరోనా చావు కంటే కుక్క చావు నయం…!

-

రోడ్డు మీద ఒక కుక్క చస్తే ఎం చేస్తారు…? వాసన వచ్చే వరకు చూస్తారు అక్కడ ఉన్న వాళ్ళు, అప్పుడు పక్కకు లాగిస్తారు. లేదు అంటే వెంటనే మున్సిపాలిటి వాళ్ళకు సమాచారం ఇస్తారు. ఏదొకటి చేసి పక్కకు లాగిస్తారు. కాని కరోనా వచ్చి ప్రాణాలు పోతే మాత్రం ఆ దిక్కు కూడా ఉండదు. కనీసం మీ శరీరాన్ని మీ ఇంట్లో వాళ్లకు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. మీ కోసం వచ్చి ఏడవడానికి ఎవరూ వచ్చే అవకాశం లేదు.

ఎవరూ కూడా మీ కోసం వచ్చి ఏడ్చే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని చివరి చూపు చూడటానికి మీతో కలిసి పెరిగిన వాడు, చదివిన వాడు, మీతో కలిసి తాగిన వాడు ఎవరూ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని కనీసం మీ వాళ్ళు కూడా ముట్టుకునే అవకాశం ఉండదు. మీకు తల కొరివి పెట్టే దిక్కు ఉండదు. గుప్పెడు మట్టి వేసి మిమ్మల్ని పూడ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఇటలీ సహా అనేక దేశాల్లో ఇప్పుడు జనాబా ఇలాగే ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు లేదు పెద్ద వాళ్ళు లేదు, పక్కకు లాగేయడమే… ఒక కవర్ లో చుడతారు. తీసుకు వెళ్లి ఎక్కడో కాల్చేస్తారు. కనీసం అస్థికలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా బయటకు రాకుండా ఇంట్లో తిని పడుకోండి. బయటకు వస్తే మాత్రం ఆ రోగం మీకే కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికి అంటుకునే అవకాశం ఉంది.

ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుక్క చావు కంటే హీనంగా ఉంటుంది. మున్సిపాలిటి వాళ్ళు కూడా లాగేసే పరిస్థితి ఉండదు. డాక్టర్లు కూడా పట్టుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు చెప్పండి అలాంటి చావు మనకి. ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చినట్టు…? దయచేసి జాగ్రత్తగా ఉండటం మంచిది. జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ప్రాణాలు కోల్పోవడం అనేది ఖాయం. కుక్క కంటే హీనంగా ఉంటుంది మన పరిస్థితి.

రోజులు ఏ మాత్రం బాగాలేదు అనే మాట అక్షరాలా నిజం. చావు ఎటు నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి. అనేక రకాలుగా కరోనా వైరస్ విస్తరిస్తుంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా సరే కరోనా వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు. దయచేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండటం అనేది మంచిది. ఇటలీ ఇలాగే తక్కువ అంచనా వేసింది. అమెరికా జోక్ అని ఇప్పుడు నరకం చూస్తుంది. మనకు కూడా ఒక రకంగా అది జోక్ గానే ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. మీరు ఊహించుకున్న దాని కంటే తీవ్రంగా ఉంది బయట.

Read more RELATED
Recommended to you

Latest news