నీ కోసమే నువ్వు బతుకు.. ఎందుకంటే నీకు ఉండేది నువ్వే…!

-

సమాజంలో ఇప్పుడు నువ్వు ఊహించిన, ఆశించిన విధంగా రోజులు లేవు అనేది వాస్తవం. అది నువ్వే కాదు ఎవరూ ఊహించని విధంగా ఉంది సమాజం. ఇక నీ తోడుగా ఎవడో నడుస్తాడు అనుకోవడం కూడా నీ భ్రమ. నీ ఆలోచనలు, నీ అవకాశాలు, నీ నడక, నడవడిక అన్ని కూడా ఎదుటి వాడికి వెటకారంగా అనిపించినా మరో రకంగా అనిపించినా నీకు తగ్గట్టు నువ్వు మార్చుకోవడమే గాని ఎదుటి వాడికి తగ్గట్టు మార్చుకోవడానికి ఏదీ లేదు.

నువ్వు ఎలా నడిచినా సరే ఎదుటి వాడు నిన్ను ఎద్దేవా చేస్తాడు, వెక్కిరిస్తాడు కాబట్టి ఎదుటి వాడి గురించి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు నీకు తోడుగా నీ కొడుకు, నీ ఫ్రెండ్, నీ భార్య, నీ భర్త ఎవరూ ఉండరు. నీ బతుకు నువ్వు బతకాలి కాబట్టి నీకోసం మాత్రమే నువ్వు బతకాలి. ఎందుకంటే నీకు తగినట్టు గా ఏదీ లేదు. సమాజం ఇప్పుడు అసలు బాగాలేదు.

అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే గాని ప్రాణానికి, స్నేహానికి ఇచ్చే విలువలు అంటూ ఏ ఒక్కటి లేవు ఉండవు అనేది వాస్తవం. స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేయడం వదిలేయ్. డబ్బు నీ కోసం ఖర్చు చేసుకో. ఎందుకంటే సంపాదించేది నువ్వు. పిల్లల మీద ఆశలు పెట్టుకోకు, పిల్లలని పెంచడం వరకే నీ బాధ్యత గాని వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవడం అనేది నీ ఆశ కాదు.

ఇక సమాజంలో ప్రతీ చిన్న దాని మీద కోరికలు పెంచుకోవడం అనేది మంచిది కాదు. ఎదుటి వాడి నుంచి ఏదో వస్తుంది అనుకోవడం కూడా మంచిది కాదు. ఆశల కోసం బతకవద్దు… ఆశయాల కోసం అసలు బ్రతకవద్దు. నీ కోసం బతుకు… నీ కోరికల కోసం బతుకు. ఎందుకంటే నీకు తోడు ఉండేది నువ్వే. సమాజం నువ్వు బాగుంటే పలకరిస్తుంది బాగోకపోతే వెక్కిరిస్తుంది రా పిచ్చోడ.

డబ్బు ప్రధానం కాదని ఒకడు అంటాడు డబ్బే ప్రధానం అని ఇంకొకడు అంటాడు. ఎవడు ఏది అన్నా సరే… నీది నువ్వు దాచుకో. ఎందుకంటే రేపు రూపాయి లేకపోతే ఎవడూ నీకు పావలా కూడా ఇవ్వడు. ఎందుకంటే నీకు ఎవడూ అండగా ఉండదు. బాగుంటే నవ్వడమే గాని బాగోకపోతే పట్టించుకోరు. కాబట్టి నీకోసం మాత్రం బతుకు, దాచుకో, ఉంచుకో, నిన్ను నువ్వు మాత్రమే నిలబెట్టుకో.

Read more RELATED
Recommended to you

Latest news