టాలీవుడ్ నిర్మాతలకి మళ్ళీ షాక్ ..?

-

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ని కొన్ని పరిమితులతో ప్రభూత్వం సడలింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిభంధనలు పాటిస్తూ కొన్ని కార్య కలాపాలను సాగించవచ్చు అంటూ అనుమతులు ఇచ్చారు. అయితే ఈ విధమైన సడలింపు చిత్ర పరిశ్రమకి కల్పించాలని నిర్మాతలు కోరారు. వీరికి మద్దతుగా ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ముఖ్య మంత్రికి తన అభ్యర్ధనను తెలిపారు. షూటింగ్ కి అనుమతులు ఇవ్వకపోయినా కూడ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు చేసుకునే వెలుసుబాటు కల్పించాలని తమ్మారెడ్డి భరద్వాజా స్పష్ఠం చేశారు.

 

అయితే అందుకు అనుమతులు ఇవ్వలేదని తాజా సమాచారం. ఈ విషయంలో నిర్మాతలకి షాకే అని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్న సినిమాలకి ఇన్ హౌజ్ వర్క్ చేసుకునే వీలును అంటే ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ వంటి అతి కొద్ది మందితో పూర్తి చేసుకునే పనులకు అనుమతిని కోరారు టాలీవుడ్ నిర్మాతలు. అయితే మే 29 వరకు పొడిగించిన లాక్ డౌన్ చిత్ర పరిశ్రమలోని అన్నీ శాఖలకి కూడా వర్తిస్తుందని అప్పటి వరకు ఏ పనులు చేయరాదని తెలిపారట.

ఈ విషయంలో తెలంగాణా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు క్లారిటి ఇచ్చారు. మే 29వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సినిమాలకు సంబందించిన ఎటువంటి వర్క్స్ నిర్వహించరాదని తెలంగాణా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా నష్టాల పాలవుతున్న నిర్మాతలకు ఈ తాజా నిర్ణయం గట్టి షాక్ ఇచ్చింది. అయితే మే 29 తర్వాత తమకి వెసులుబాటు ఇస్తారన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news