కుటుంబాన్ని మింగేసిన ఇల్లు, ఆ ఇంట్లో ఏముంది…? రెండేళ్లలో ముగ్గురు మృతి…!

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం, కామవరపు కోట మండలం… తల్లి తండ్రులు రోజు వారీ కూలీలు, ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉండటంతో తల్లి తండ్రులకు అండగా నిలుస్తున్నారు పిల్లలు… ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈ సమయంలోనే కుటుంబానికి పెద్ద భారం వచ్చి పడింది. కష్టాలు పడి కూతురికి దాదాపు రెండేళ్ళ క్రితం పెళ్లి చేసారు. ఆ తర్వాత ఆమెకు ఏడాది క్రితం కొడుకు పుట్టాడు.

రెండు రోజులు ఐసియులో పెట్టారు. అయినా సరే బ్రతకలేదు. కూతురుకి ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. ఆస్పత్రికి తీసుకుని వెళ్తే పరిక్షలు చేసి నిమ్ము ఉందని గుర్తించారు. వెంటనే చికిత్స మొదలు పెట్టారు. ఎముకలలో కాల్షియం పడిపోయింది అని చెప్పడంతో విజయవాడ, హైదరాబాద్, ఏలూరు ఇలా తిప్పారు. 5 నెలలు క్రితం కూతురు చనిపోయింది. ఆర్ధికంగా కుటుంబం బాగా చికితిపోయింది.

90 వేల వరకు అప్పు చేసారు. ఆ వెంటనే నెల రోజుల క్రితం తేరుకున్న కుటుంబం… కొడుకుని ఒక ఆసామి దగ్గర పనికి కుదిర్చారు. నెల రోజుల క్రితం నుంచి అతను అక్కడ పనికి వెళ్తున్నాడు. అతని ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేకపోయినా సరే… ఈ సమయంలో జ్వరం వచ్చింది… జ్వరం వచ్చి తగ్గిపోయింది అనుకుని నాటుకోడి మాంసం తిన్నాడు. కామెర్లు బయటపడ్డాయి. కోలుకున్నట్టే కనిపించాడు.

అయితే ఏదో తేడాగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి నాలుగు రోజుల క్రితం లాక్ డౌన్ ఉన్నా సరే తీసుకుని వెళ్ళారు. గుంటూరులో అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో లోపల పేగు పగిలిపోయి చనిపోయాడు. చనిపోయినప్పుడు కూతురు వయసు 18 ఏళ్ళు, కొడుకు వయసు 19 ఏళ్ళు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు కళ్ళ ముందే చనిపోవడం, ఆర్ధిక పరిస్థితి చితికిపోవడం తో ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.

నాలుగు రోజుల క్రితం సరదాగా ఉన్న తన తమ్ముడు ఇలా విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ అన్న ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నాడు. మమ్మల్ని కాటికి మోసే పిల్లలని, మేము ఇలా కాటికి మోస్తున్నాం అంటూ ఆ తల్లి తండ్రులు పెడుతున్న కన్నీరు గ్రామస్తులను కలచివేస్తుంది. ఇక్కడ కీలక విషయం ఏంటీ… వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటిని వేరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసారు. ఎవరి దగ్గరైతే కొనుగోలు చేసారో… ఆ ఇంటి యజమాని భార్య కూడా చనిపోయింది. దీనితో ఆ ఇంట్లో ఏదో ఉందీ అనే భయంతో ఇప్పుడు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.