Good News : ఇక తెలుగులో బ్యాంకు ఎగ్జామ్స్ !

-

బ్యాంకు పరీక్షలను ఇప్పటివరకు ఇంగ్లిష్/హిందీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనివల్ల తెలుగు విద్యార్థులు ఇంగ్లిష్ ప్రశ్నపత్రం అర్థం కాక ఐబీపీఎస్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేకపోతున్నారు. గురువారం లోక్‌సభలో కేంద్ర మంత్రి తెలుగు విద్యార్థులకు శుభవార్త తెలిపింది. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగార్థులకు శుభవార్త.

13 regional languages including telugu for banking exams

ఇకపై బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. బీఎస్‌ఆర్‌బీ ఇకపై 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు నిర్వహించనుంది. ప్రస్తుతం ఆంగ్లం, హిందీ భాషల్లోనే బ్యాంకు పరీక్షలు రాసే అవకాశం ఉంది. దీని వల్ల ప్రాంతీయ భాషల్లో చదువు పూర్తిచేసిన వారికి పరీక్ష రాయడం కాస్త కష్టంగా ఉండేది. ఆంగ్లం అర్థం కాకపోవడం వల్ల కూడా కొందరు అభ్యర్థులు పరీక్షల్లో విఫలమవుతున్నారు.

తాజా నిర్ణయంతో ఈ అభ్యర్థులకు మేలు జరగనుంది. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చే విద్యార్థులకు ప్రశ్నలు మరింత సులువుగా అర్థమవుతాయి. త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్లలో ఈ మార్పు జరుగనున్నది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version