తెలంగాణ నిరుద్యోగులకు భలే ఛాన్స్.. 3000 ఉద్యోగాలు రెడీ..!

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. కొన్నాళ్లుగా కొత్త ఉద్యోగాల సందడి లేని కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా మూడు వేల కొత్త ఉద్యోగాలకు పచ్చజెండా ఊపింది. మూడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఈ ఉద్యోగాలన్నీ విద్యుత్‌ శాఖకు సంబంధించినవే.

తెలంగాణ ట్రాన్స్ కోకు సంబంధించిన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ ద్వారా విడుదలైంది. మొత్తం 2,939 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మొత్తం మూడు రకాలు జాబ్స్ ఉన్నాయి. అవేమిటంటే.. జూనియర్ లైన్ మెన్, కంప్యూటర్ ఆపరేటర్, జేపీవో.

ఈ మూడు ఉద్యోగాల్లో అత్యధికంగా జూనియర్ లైన్ మెన్ ఉన్నాయి. అవి ఏకంగా 2,438 జూనియర్ లైన్‌మెన్‌ ఉద్యోగాలు ఉన్నాయి. వీటి తర్వాత అత్యధికంగా 477 కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక జేపీవో పోస్టులు కేవలం 24 మాత్రమే ఉన్నాయి.

తెలంగాణలో కొన్నాళ్లుగా పెద్దగా నోటిఫికేషన్లు లేవు.. మరోవైపు ఏపీలో జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఒకటే ఉద్యోగాలు.. గ్రామవాలంటీర్లు 3,4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు సచివాలయ ఉద్యోగాల పేరుతో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ నిరుద్యోగుల్లో మాకేమీ నోటిఫకేషన్లు లేవా అన్న నిరాశ మొదలైంది.

ఇటీవలే కానిస్టేబుల్ నియామక పరీక్ష పత్రాల ఫలితాలు కూడా వచ్చాయి. ఇక ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారు పాత ప్రశ్నాపత్రాలను ఒక్కసారి గమనిస్తే.. ప్రిపరేషన్ విధానం అర్థమవుతుంది. ఈ ఉద్యోగాల కోసం పోటీ పడేవారికి మనలోకం ఆల్ ది బెస్ట్ చెబుతోంది.