మొత్తం 8400 ఖాళీలు
డిగ్రీ/ఇంజినీరింగ్ చదివిన వారికి అవకాశం
ఆర్‌ఆర్‌బీ-సీఆర్‌పీ
– గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సీఆర్‌పీ ద్వారా అఫీసర్లు, అసిస్టెంట్లు తదితర పోస్టులు భర్తీ చేస్తుంది.
– పోస్టులు: ఆఫీసర్ (స్కేల్- I, II, III)- గ్రూప్ ఏ స్థాయి. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)- గ్రూప్ బీ స్థాయి.
మొత్తం ఖాళీలు: 8,400
తెలుగు రాష్ట్రాలలో ఖాళీల సంఖ్య-350
తెలంగాణలో: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు.
ఆంధ్రప్రదేశ్‌లో: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు.
అర్హతలు
ఆఫీస్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, నిర్దేశించిన స్థానిక భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 18-28 ఏండ్ల మధ్య ఉండాలి.
స్కేల్-I ఆఫీసర్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అ్ండ కో ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. వయసు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
స్కేల్-II ఆఫీసర్ (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-మేనేజర్): ఏదైనా డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్స్, అగ్రికల్చరల్ తదితర రంగాల్లో డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత రంగంలో కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
స్కేల్-II ఆఫీసర్ (స్పెషలిస్ట్ ఆఫీసర్లు): ఐటీ- డిగ్రీలో ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్స్, సీఎస్, ఐటీ లేదా తత్సమాన సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. అకౌంట్స్ విభాగానికి సీఏ, లా ఆఫీసర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
నోట్: పై రెండు పోస్టులకు 21 నుంచి 32 ఏండ్ల మధ్య వయసు ఉండాలి.
స్కేల్-III ఆఫీసర్: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి. వయసు 21 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ/మెయిన్, సింగిల్ విధానంలో చేస్తారు, వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 4
ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు రూ.100/-
ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ: ఆఫీస్ అసిస్టెంట్ ఆగస్టు 17, 18, 25
ఆఫీసర్ పోస్టులకు ఆగస్టు 3, 4, 11
వెబ్‌సైట్: ibps
– కేశవ