హైదరాబాద్ NIMSలో ఉద్యోగాలు… వివరాలు మీకోసం…!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. నిజాం ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency

 

అసిస్టెంట్ ప్రొఫెసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్స్ విభాగంలో ఈ ఖాళీలని భర్తీ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి వివరాలలోకి వెళితే..

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకైతే అభ్యర్థులు M.D/DNB (in Radio Diagnosis) విద్యార్హత కలిగి ఉండాలి. దీంతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకైతే డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చెయ్యచ్చు. దీంతో పాటు డేటా ఎంట్రీ విభాగంలో అనుభవం ఉండాలి.

హెల్పర్ పోస్టులకైతే ఎలాంటి విద్యార్హతను నోటిఫికేషన్లో పేర్కొనలేదు. దరఖాస్తులకు డిసెంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తులను The Dean Nizams Inistute Of Medical Sciences, Panjagutta, Hyderabad-500082, TS. చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..

ముందు https://www.nims.edu.in/index ఓపెన్ చేయాలి.
అక్కడ రిక్రూట్మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Recruitment of Temporary Post in Tele-Radiology HU ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ కోసం డౌన్లోడ్ పైన క్లిక్ చెయ్యండి.
వివరాలని ఎంటర్ చెయ్యండి.
విద్యార్హతల సర్టిఫికేట్లను అప్లికేషన్ ఫామ్ కు జత చేయాలి.
చిరునామాకు పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.