RRR : ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్డేట్.. ఫోర్త్ సింగిల్ ముహూర్తం ఖరారు

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభ వార్త చెప్పింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి నాలుగవ సింగిల్ విడుదల తేదీ ని ఫైనల్ చేసింది చిత్రబృందం. ఇవాళ  ఉదయం 11: 30 గంటలకు revolt of Bheem పేరుతో సాంగు ప్రోమో ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది చిత్ర బృందం. ఈ పూర్తి పాటను రేపు విడుదల చేయనుంది.  ఈ సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఉంటుందని ఈ అనౌన్స్మెంట్ ద్వారా మనకు అర్థమవుతుంది.

ఇక ఈ తాజా అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ నటించింది. జనవరి 7 న ఈ సినిమా విడుదల కానుంది.