హైద‌రాబాద్‌లో వాయిస్‌/ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హిందూజ గ్లోబ‌ల్ సొల్యూష‌న్స్ లిమిటెడ్ తాజాగా నోటిఫికేషన్ ని భర్తీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వాయిస్‌/ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు.

ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇంట‌ర్వ్యూ ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్ట్ పై ఇంట్రస్ట్ ఉంటే హైద‌రాబాద్‌ లో ఇంట‌ర్వ్యూకి హాజ‌రు అవ్వాలి. ఇక అర్హత విషయం లోకి వస్తే.. బీటెక్ కాకుండా ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వారిని ఈ పోస్టుల ఇంట‌ర్వ్యూల‌కు వెళ్ళచ్చు.

వాయిస్ ప్రాసెస్ టెలికాల‌ర్‌కు సంవ‌త్స‌రానికి రూ.2,34,000 వేత‌నం అందిస్తారు. నాన్ వాయిస్ ప్రాసెస్ అభ్య‌ర్థుల‌కు ఏటా రూ.1.68 ల‌క్ష‌ల వేతనం ఉంటుంది. ఎటువంటి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్నారు. ఇంటర్వూస్ న‌వంబ‌ర్ 16,17,18,19 తేదీల్లో జరుగుతాయి. బీటెక్ మినహా ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. అలానే ఎటువంటి అక‌డ‌మిక్ బ్యాక్‌లాగ్స్ ఉండ‌కూడ‌దు అని గమనించండి.

ఇంటర్వ్యూ నిర్వ‌హించే ప్రదేశం: Hinduja Global Solutions,Purva Summit – 3rd floor,
Survey No. 8, Hitech city Phase II White field, Land Mark : Opp Tech Mahindra, Kondapur, Hyderabad 500084.

Read more RELATED
Recommended to you

Latest news