ప్రధాని మోడీ కి హ్యాట్సాఫ్.. తప్పు జరిగిందని క్షమాపణలు చెప్పడం హుందా తనంగా అనిపించిందని…అలా చెప్పడం గ్రేట్ అని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ప్రధాని మోడీ చెప్పడం హుందాతనమే.. అది రాష్ట్ర బిజెపి నేతలకు కూడా వుండాలన్నారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా రైతులు ఉద్యమం చేశారని తెలిపారు. కాంగ్రెస్ సిగ్గు పడాలి.. రైతులు ఉద్యమం చేస్తే కనీసం మద్దతు ఇవ్వలేదన్నారు.
100 జాకిలు పెట్టి లేపినా కాంగ్రెస్ లేవదని… ఈ చట్టాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏ.. వాళ్ళు పురుడు పోస్తే.. మోడీ పెంచి పోషించారని తెలిపారు. ఈ దాష్టీకానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఏ..కాంగ్రెస్ వాళ్లకు ఈ చట్టాలపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్ అంగీకరించాలని… చట్టాల వల్ల మేలు జరుగుతుందని వాదించిన మేధావులు జాతికి క్షమాపణ చెప్పాలని వెల్లడించారు. ఇది రైతుల విజయం, కేసీఆర్ విజయమని కొనయాడారు. సీఎం కేసీఆర్ ప్రజ్ఞా పాటవాలు, రాజకీయ చతురత ప్రధాని మోడీకి తెలుసన్నారు. అందుకే కేంద్ర, బిజెపి వ్యతిరేక వ్వుధ్యమలకు సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తారని అది మహ ప్రజల్వన అయితదని మోడీకి తెలుసని వెల్లడించారు. చలికి వణికి, ఎండకు ఎండి పోరాటం చేసిన రైతులకు అభినందనలు అన్నారు.