హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వివరాలివే…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ట్రైనీ ఇంజనీర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 ఖాళీలుని భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షలు ఇస్తారు. గేట్ 2021 లో అభ్యర్థులు సాధించిన స్కోర్ ని బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. కనుక గేట్ 2021 ని వ్రాసిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ట్రైనీ ఇంజనీర్(సివిల్) పోస్టులకి అప్లై చేసుకోచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచలర్ డిగ్రీ చేసిన వారు ట్రైనీ ఇంజనీర్(మెకానికల్) పోస్టులకి అప్లై చెయ్యచ్చు.

ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బ్యాచలర్ డిగ్రీ చేసిన వారు ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్టులకి అప్లై చేసుకోచ్చు. సీఏ చేసిన అభ్యర్థులు ట్రైనీ ఆఫీసర్(ఫైనాన్స్) కి అప్లై చేసుకోచ్చు. కంపెనీ సెక్రటరీ చేస్తే ట్రైనీ ఆఫీసర్(కంపెనీ సెక్రటరీ) ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలని http://www.nhpcindia.com/home.aspx వెబ్సైట్ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news