మందు బాబులకు అలర్ట్…రాత్రి 10 గంటల లోపే ఇంటికి వెళ్ళండి ..!

-

న్యూయర్ వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే క్లబ్ లు, పబ్ లు, హోటళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు చర్యలకు సిద్ధం అవుతున్నారు. ఎక్కువగా క్లబ్ లు పబ్ లు ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లతోపాటు ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి 10 గంటల నుండి అడుగడుగునా తనిఖీలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

కేవలం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక తాగి మద్యం నడిపితే ఆరు నెలల జైలు శిక్ష మరియు 10 వేల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news