మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 59 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్/ NCVT నుంచి ఐటీఐ లేదా డిగ్రీ/డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. BIOM, Bacheli Complex, Bacheliలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
సెలెక్ట్ అయితే అప్రంటీస్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను నోటిఫికేషన్లో చూడొచ్చు. స్క్రూటినీ మరియు సెలక్షన్ కమిటీ ఆధ్వారంలో రూపొందించిన మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే NMDC లేదా ఇతర ఏ సంస్థలో అయినా అప్రంటీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు మరియు డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు అవకాశం లేదు అని నోటిఫికేషన్ లో తెలిపారు. గతంలో 10.05.2021న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న వారు కూడా ఈసారి అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలని నోటిఫికేషన్ లో చూడచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.