ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి…!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ముంబాయి లోని ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో పలు పోస్టులని భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో టెక్స్‌టైల్ టెస్టింగ్ ఫెలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థికి రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు. ఎంపికైన వాళ్ళు బెంగుళూరు, చెన్నై తదితర చోట్ల పని చెయ్యాలి. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేయనున్నారు.

పరీక్ష ఏమి లేదు. డిసెంబ‌ర్ 24, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/applications-post-fellow-textile-testing ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల మెరిట్ ఆధారంగా ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..

ముంద‌గా అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/ ను సంద‌ర్శించాలి.
నెక్స్ట్ Applications for the post of Fellow (Textile Testing) లింక్‌లోకి వెళ్లాలి.
అక్కడ వివరాలని చూసుకోవచ్చు.
ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఏ రాష్ట్రానికి ద‌ర‌ఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన కార్యాల‌యం అడ్ర‌స్‌కు పంపాలి.
నోటిఫికేషన్ లో అడ్రెస్ వివరాలు ఉంటాయి.