పోస్ట్ ఆఫీస్ లో 98,083 ఉద్యోగాలు… అర్హత, అప్లై చేసుకునే ప్రాసెస్ మొదలైన వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పోస్ట్ ఆఫీస్ లో 98,083 ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలు 59,099, మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 1445, ఎంటీఎస్‌ పోస్టులు 37,539 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే.. వయసు 18-32 మధ్య ఉండాలి. పదో తరగతి అర్హత ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. డిసెంబరు వరకు దరఖాస్తు ని చేసుకోవడానికి అవుతుంది. రాత పరీక్ష ఉంటుంది.

ఏపీ సర్కిల్‌ లో చూస్తే.. 2289 పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలు వున్నాయి. 1166 ఎంటీఎస్‌ పోస్టులు, 108 మెయిల్‌ గార్డ్‌ పోస్టులు వున్నాయి. తెలంగాణ సర్కిల్‌ పరిధిలో 1553 పోస్ట్‌మెన్‌ జాబ్స్‌ వున్నాయి. 82 మెయిల్‌ గార్డ్‌ పోస్టులు, 878 ఎంటీఎస్‌ పోస్టులు వున్నాయి. జీతం రూ. 33,718 నుండి రూ. 35,370 వరకు ఉంటుంది. పూర్తి వివరాలను https://www.indiapost.gov.in/ లో చూడొచ్చు. ఇక అర్హత వివరాలను చూస్తే.. మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో టెన్త్ ప్యాస్ అయ్యి ఉండాలి. పోస్ట్‌మ్యాన్ పోస్టులకు ఇంటర్ ప్యాస్ అయ్యి ఉండాలి. అదే ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో టెన్త్ పూర్తి చేసి ఉండాలి.

పోస్టులు వివరాలు:

మొత్తం ఖాళీలు: 98,083
పోస్ట్‌మ్యాన్ పోస్టులు: 59,099
మెయిల్ గార్డు పోస్టులు: 1445
మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 37,539

official website: https://www.indiapost.gov.in/

 

 

Read more RELATED
Recommended to you

Latest news