‘ఉగ్ర’ పవన్.. కూల్చే సత్తా.. వైసీపీలో టెన్షన్..?

-

అనవసరంగా పవన్‌ని వైసీపీ నేతలు కెలికినట్లే కనిపిస్తున్నారు…అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్షమైన చంద్రబాబు, టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే వారు మొదట్లో కేసులకు భయపడి, వైసీపీపై కౌంటర్ ఎటాక్ చేయలేదు. ఎక్కడైనా లొసుగులు ఉంటే వాటిని పట్టుకుని కేసులు పెట్టి, పలువురిని జైలుకు కూడా పంపారు. దీంతో కొంతమంది సైలెంట్ అయ్యారు.

కానీ ఈ కేసులు పెట్టడం, జైలుకు వెళ్ళడం కామన్ అయింది..దీంతో టీడీపీ నేతలు తెగించేసి ఏదైతే అది అవుతుందని కేసులకు వెనుకాడకుండా వైసీపీపై పోరాటం చేస్తున్నారు. కాకపోతే టీడీపీ వల్ల వైసీపీకి అనుకున్న స్థాయిలో ఇబ్బందులు రాలేదు. ఎప్పుడైతే వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అప్పటినుంచి సీన్ మారింది. విశాఖ ఘటన ముందు వరకు ఎప్పుడు పవన్‌ని అడ్డుకోలేదు. చంద్రబాబు, లోకేష్ మాదిరిగా వారి పర్యటనలు అడ్డుకున్నట్లు పవన్‌ని అడ్డుకోలేదు. కానీ విశాఖ టూరులో పవన్‌ని అడ్డుకున్నారు. దీంతో పవన్‌ ఊహించని స్థాయిలో ఎప్పుడు బూతులు తిట్టే వైసీపీ నేతలకు అదే బూతులతో సమాధానం చెప్పారు.

అలాగే చంద్రబాబు, పవన్‌ని కలిశారు. దీంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ-జనసేన కలవడం వైసీపీకి పెద్ద రిస్క్. అందుకే పవన్‌ని ఇంకా ఎక్కువగా వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇదే క్రమంలో గత మార్చిలో జనసేన సభకు స్థలం ఇచ్చారని, రోడ్డు వెడల్పు పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్ళు కూల్చివేశారు. దీంతో వెంటనే పవన్ అక్కడకు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు..అయినా కారు దిగి నడుస్తూ..అరెస్ట్ అవ్వడానికైనా, రక్తం చిందించిడానికైనా రెడీ అని చెప్పి..పోలీసులపై ఫైర్ అయ్యారు.

ఇక కారు టాప్‌పై కూర్చుని ఏ బెదురు లేకుండా..ఇంకా ఏం చేసుకుంటారో చేసుకోండి అని, ఇప్పటంకు వచ్చి…అక్కడ బాధితులకు అండగా నిలిచి..వైసీపీపై విరుచుకుపడ్డారు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని అన్నారు. ఇక పవన్‌కు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.. బాబు చెప్పినట్లే పవన్ ఆడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం కూల్చి వేయడానికి పేక మేడ కాదు…సినిమా సెట్టింగ్ కాదని… ప్రజల నుంచి జగన్‌ను ఎవరూ వేరు చేయలేరని మంత్రులు కౌంటర్లు ఇచ్చారు.

అయితే పైకి వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు గాని..పవన్, బాబుతో కలిస్తే వైసీపీకి ఇబ్బందే ఆ విషయం..వైసీపీ నేతలకు కూడా తెలుసు. బాబు-పవన్ కలవడం, పవన్ మరింత ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేయడంపై..ఆ పార్టీలో టెన్షన్ పెరిగిందని చెప్పొచ్చు. ఏదేమైనా టీడీపీతో పవన్ కలిస్తే..వైసీపీని కూల్చే సత్తా ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news