ఎయిమ్స్ బీబీన‌గర్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చెయ్యండి..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (All India Institute of Medical Sciences), బీబీన‌గ‌ర్ లో పలు ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

ఏయిమ్స్ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేష‌న్ ద్వారా పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే aiimsbibinagar.edu.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ – సెప్టెంబ‌ర్ 25, 2021.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రొఫెసర్-కమ్-ప్రిన్సిపాల్, నర్సింగ్ కాలేజ్- 1, రిజిస్ట్రార్-1, రీడర్/అసోసియేట్ ప్రొఫెసర్, నర్సింగ్ కళాశాల -2, లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ -3, ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్, నర్సింగ్ కాలేజ్- 15. ద‌ర‌ఖాస్తు పంపిన అభ్య‌ర్థులో షార్ట్ లిస్ట్ చేసి వారి మెయిల్‌కు ఇంట‌ర్వ్యూ స‌మాచారం అందిస్తారు.

కేవ‌లం ఆన్‌లైన్ మోడ్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైట్ లోకి వెళ్లి.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి. ఆ తరవాత ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి. నెక్స్ట్ అనంత‌రం ఫాం కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేష‌న్‌ను రెండు కాపీలు ప్రింట్ తీసుకోవాలి. ఒక కాపీని అభ్య‌ర్థి త‌మ వ‌ద్దే దాచుకొని. మ‌రో కాపీని ఈ అడ్ర‌స్‌ కి పంపాలి.

The Administrative Officer,
All India Institute of Medical Sciences, Bibinagar
Hyderabad Metropolitan Region (HMR), Telangana-508126, India
Tel. No. : 08685-279306

నోటిఫికేషన్: https://aiimsbibinagar.edu.in/pdf/Group_A__Advt_updated.pdf
వెబ్సైట్: https://aiimsbibinagar.edu.in/