మీకు ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉందా..? అయితే ఇది మీకు సువర్ణావకాశం. కనుక ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటే మీరు అనుకున్నది మీరు సులభంగా సాధించచ్చు. ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సామాజిక సమస్యలపై కథా, కథనాలు రాసి చక్కని ప్రతిభ కలిగిన ఫిల్మ్‌మేకర్లను గుర్తించేందుకు ఇండియాసిఎస్ఆర్‌తో కలిసి హైఫెన్ సినీ ఇంపాక్ట్ ఫిల్మ్ ఫెలోషిప్ 2021ను అందిస్తోంది.
ఒకవేళ కనుక మీకు ఆసక్తి ఉంటే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోద్దు. ఎందుకంటే ఈ ఫిల్మ్ ఫెలోషిప్ ద్వారా తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకోవచ్చు. వయసు విషయానికి వస్తే.. అప్లై చేసుకోవాలని అనుకునే వారి వయస్సు 25 ఏళ్లు మించకూడదు గమనించండి. ఆన్‌లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అలానే ఈ ఫెలోషిప్‌లో ఫిల్మ్ మేకింగ్ రూ.లక్ష గ్రాంట్ అందిస్తారు. అంతే కాకుండా అవార్డు ప్రైజ్ కింద మరో రూ.లక్ష వరకు కూడా పొందొచ్చు. NGO లు మరియు కార్పొరేట్‌స్ ద్వారా నిర్వహించబడే కమ్యూనిటీ కార్యక్రమాలపై చిత్రాలను రూపొందించడానికి జట్లకు రెండు నెలల సమయం ఇవ్వడం జరుగుతుంది.
అక్టోబర్ 25, 2021 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మంచి బహుమతులు మరియు రివార్డులు కూడా ఉంటాయి. ఫిల్మ్ మేకింగ్ గ్రాంట్ రూ. 1,00,000 వరకు పొందొచ్చు. అలానే రూ.1,00,000 విలువైన నగదు బహుమతులు పొందొచ్చు. ఫిల్మ్ మేకింగ్ బూట్‌క్యాంప్ అండ్ మెంటర్‌షిప్ లభిస్తుంది. పూర్తి వివరాల కోసం అధికారి వెబ్‌సైట్ https://thehyphen.in/cine-impact/ ను సందర్శించాలి.