నిరుద్యోగులకు బీఈసీఐఎల్‌ గుడ్‌న్యూస్‌! వివరాలు ఇలా..

-

నిరుద్యోగులకు బీఈసీఐఎల్‌ గుడ్‌న్యూస్‌! వివరాలు ఇలా..నిరుద్యోగులకు బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌) గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఈ సంస్థ తాజాగా ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది.

ఎడిటర్, అసిస్టెంట్‌ ఎడిటర్, ప్రూఫ్‌ రీడర్, బిజినెస్‌ ఎగ్జిక్యూటీవ్, మార్కెటింగ్‌ సూపర్వైజర్‌ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు జులై 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇప్పటికే పలు ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు ఇస్తున్న బీఈసీఐఎల్‌ దీంతో ఇప్పుడు మరో నోటిఫికేషన్‌ అందించింది.

బీఈసీఐఎల్‌

ఖాళీల వివరాలు

మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఎడిటర్‌–2 పోస్టులు
అసిస్టెంట్‌ ఎడిటర్‌–2
ప్రూఫ్‌ రీడర్‌ – 2
బిజినెస్‌ ఎగ్జిక్యూటీవ్‌ – 2
మార్కెటింగ్‌ సూపర్‌ వైజర్‌– 2

విద్యార్హతలు

ఎడిటర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ చేసిన వారు అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేషన్‌ లెవల్‌ లో అభ్యర్థులు ఇంగ్లిష్‌ ను సబ్జెక్టుగా కలిగి ఉండాలి.
అసిస్టెంట్‌ ఎడిటర్‌ పోస్టుకు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పొంది ఉండాలి. జర్నలిజం/పబ్లిషింగ్‌ లో అనుభవం ఉండాలి. ప్రూఫ్‌ రీడర్‌.. డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఇంగ్లిష్‌/హిందీ భాషలో పరిజ్ఙానం కలిగి ఉండాలి.
బిజినెస్‌ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టుకు గ్రాడ్యుయేషన్‌ తో పాటు అడ్వర్టైజ్మెంట్‌ అండ్‌ మార్కెటింగ్‌ లో పీజీ డిప్లొమో చేసి ఉండాలి. కనీసం 2 సంత్సరాల అనుభవం ఉండాలి.
మార్కెటింగ్‌ సూపర్వైజర్‌: ఎంకామ్‌ తో పాటు బుక్‌ మార్కెటింగ్‌ లో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news