తెలంగాణలో రక్త మోడిన రోడ్లు.. ఆరుగురు దుర్మరణం

-

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం పలుచోట్ల రోడ్లు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. ప్రతి రోజు ఘటనలు జరగుతున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.  అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రమాదాల్లో ఒక్కరు చనిపోయినా కుటుంబాల్లో తీవ్ర విషాదాలు అలుముకుంటున్నా అవగాహన రావడంలేదు.

తాజాగా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదలు చూస్తే….
వికారాబాద్‌ జిల్లా కొడంగల్ పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైవేపై ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కొడంగల్‌ శివారులోని బండల ఎల్లమ్మ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంపుర వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. అదుపు తప్పి టవేరా వాహనం కల్వర్టు‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘనటలో ఇద్దరు మృతి చెందగా14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని రిమ్స్‌కు తరలించారు. బాధితులంతా ఛత్తీస్ గడ్-మహారాష్ట్ర‌కు చెందిన వలస కూలీలగా గుర్తించారు. ఉపాధి కోసం నాగ్ పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news