నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 285 ఉద్యోగాలు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దీనిలో మొత్తం 285 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..

ఎయిర్‌వింగ్, పారామెడికల్ స్టాఫ్, వెటర్నరీ స్టాఫ్‌ను నియమించుకుంటోంది. ఈ మూడు విభాగాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే..

మొత్తం ఖాళీలు- 285, అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్- 49, అసిస్టెంట్ రేడియో మెకానిక్- 8, కానిస్టేబుల్- 8, స్టాఫ్ నర్స్- 74, ఏఎస్‌ఐ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్- 2, ఏఎస్‌ఐ ల్యాబరేటరీ టెక్నీషియన్- 56, విజిల్- 18, హెచ్‌సీ (వెటర్నరీ)- 40, కానిస్టేబుల్ (కెన్నెల్‌మ్యాన్)- 30.

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నారు. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rectt.bsf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ద్వారా అర్హత, ఆసక్తి వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news