కాంగ్రెస్‌కు భారీ షాక్.. 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా?

మణిపూర్: కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గోవిందాస్ కంతౌజం రాజీనామా చేశారు. కంతౌజంతో పాటు మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు.మణిపూర్‌లో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తుండటంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

కాగా వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. ఆ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కింకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆకర్షిస్తోంది. ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను బలహీన పర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కీలక నేతలే టార్గెట్‌గా రాజీకీయాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీలోకి చేరిపోయారు. తాజాగా మణిపూర్ పీసీసీ ఛీప్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి వలసను కట్టడి చేస్తోందేమో చూడాలి.