సెమిస్టర్​ పద్ధతిలో సీబీఎస్​ఈ ఎగ్జామ్స్..! వివరాలివే..!

-

ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతి విద్యార్థుల కోసం సరికొత్త ఎగ్జామినేషన్ ప్యాట్రన్ తీసుకొచ్చింది. 2021-22వ విద్యా సంవత్సరం నుంచి ఇది ఆమెలోకి వస్తోంది. సిలబస్ ని రెండు భాగాలుగా విభజించి ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలలోకి వెళితే..

టర్మ్-1 ఎగ్జామినేషన్ నవంబర్-డిసెంబర్, 2021 మధ్య కాలంలో నిర్వహిస్తామని ప్రకటించింది. పరీక్ష సమయం 90 నిమిషాలు. సబ్జెక్టివ్/ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఇది. 10వ తరగతి విద్యార్థులకు టర్మ్-1 ఎగ్జామినేషన్ అయితే నవంబర్​ 17నుంచి మొదలు కానుంది. అదే 12వ తరగతి విద్యార్థులకు అయితే నవంబర్​ 16తేదీ నుంచి మొదలవ్వనున్నాయి.

ఇది ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా మొత్తం 26 వేల స్కూళ్లు బోర్డుతో అనుబంధమై ఉండగా…26 దేశాల్లో కూడా సీబీఎస్ఈ బోర్డు అనుబంధ స్కూల్స్ వున్నాయి. అలానే బీఎస్ఈ బోర్డు కస్టమైజ్డ్ ఓఎంఆర్ షీట్లను ఆన్ లైన్ లో ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ కి పంపడం జరుగుతుంది. అయితే స్కూల్స్ ఈ షీట్ డౌన్‌లోడ్ చేసుకొని విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది.

స్పెసిమెన్/నమూనా కూడా పాఠశాలలకు పంపిణీ చేస్తుంది. ఈ ప్రక్రియ వలన ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ చేయడం విద్యార్ధులకి వస్తుంది. ఎగ్జామినేషన్ ఉదయం 11:30 నిర్వహించాలని సీబీఎస్ఈ తెలిపింది. ఏవైనా మార్పులు ఉంటే ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో మారుస్తారు. అలానే కరోనా నిబంధనల్ని పాటించడం కూడా చాలా ముఖ్యం.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version