DSSSB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 1809 ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 1809 ఖాళీలు వున్నాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ మొదలైన పోస్టులు వున్నాయి. అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 మార్చి 15న ప్రారంభం కానుంది.

అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 14 చివరి తేదీ. https://dsssb.delhi.gov.in/ లేదా https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్లలో పూర్తి వివరాలని చూడొచ్చు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… టెక్నికల్ అసిస్టెంట్- 32, ల్యాబరేటరీ అటెండెంట్- 66, అసిస్టెంట్ కెమిస్ట్- 40, అసిస్టెంట్ ఇంజనీర్ ఈ అండ్ ఎం- 14, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ లేదా మెకానికల్)- 62, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ 1- 16, పర్సనల్ అసిస్టెంట్- 84.

ఫార్మసిస్ట్- 82, అసిస్టెంట్ డైరెక్టర్- 3, అసిస్టెంట్ గ్రేడ్ 2- 28, జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)- 13, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్- 31, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ- 6, సెక్యూరిటీ సూపర్‌వైజర్- 9, అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్- 158, కార్పెంటర్ 2 క్లాస్- 4, అసిస్టెంట్ ఫిల్టర్ సూపర్‌వైజర్- 11, ప్రోగ్రామర్- 5, టీజీటీ (చెవిటి & మూగ)- 19, స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ- 1126. వీటికి సంబంధించి అర్హతలు వేరు వేరుగా వున్నాయి. కాబట్టి నోటిఫికేషన్ నుండి తెలుసుకోండి. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. ఒక దశ లేదా రెండు దశల రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news