గుడ్ న్యూస్.. ఫారెస్ట్ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ లో పలు పోస్టులని భర్తీ చేయనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. దీని ద్వారా 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 6 నుండి 27 మధ్య ఆన్‌లైన్ దరఖాస్తులను పంపాల్సి వుంది.

సెప్టెంబర్ 6 నుండి 30 వరకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు. పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రొఫెసర్లు – 2, అసోసియేట్ ప్రొఫెసర్లు – 4, అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 21 వున్నాయి. పూర్తి వివరాలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC వెబ్‌సైట్ www.tspsc.gov.inలో వున్నాయి. అప్లికేషన్, అర్హత మొదలైన సమాచారాన్ని ఆ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు.