నిరుద్యోగుల‌కు శుభవార్త‌: రైల్వేలో 35277 ఉద్యోగాలు

-

దేశంలో అత్యధిక ఉద్యోగస్తులు ఉన్న కేంద్ర సంస్థల్లో రైల్వే ఒకటి. ఎలక్షన్ల పుణ్యమా అంటూ కేంద్రం కొలువుల రైలుకు పచ్చ జెండా ఊపింది. లక్షా ముపైవేల పోస్టులను రైల్వేలో భర్తీ చేయడానికి ప్రకటనను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల వివరాలు సంక్షిప్తంగా…

  • పది, ఇంటర్, డిగ్రీ, బీఈడీ అభ్యర్థులకు అవకాశం
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక
  • ఆకర్షణీయమైన జీతాలు, భద్రమైన కొలువులు

పదోతరగతి నుంచి డిగ్రీ/ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థుల వరకు ఇదొక సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు.

జాబ్‌ల వివరాలు…

ఆర్‌ఆర్‌బీ -ఎన్‌టీపీసీ : నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలుగా పిలిచే కొలువులు.

మొత్తం ఖాళీలు – 35277
దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌ఆర్‌బీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు- ఖాళీలు:

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 4139

అర్హత: ఇంటర్
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ -760
జూనియర్ టైం కీపర్ – 17

Railway recruitment 2019

పై రెండు పోస్టులకు అర్హత: ఇంటర్, కంప్యూటర్‌పై ఇంగ్లిష్/హిందీలో టైపింగ్‌లో ప్రావీణ్యం ఉండాలి.

ట్రెయిన్ క్లర్క్ -592

అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్-4940
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత

గ్రాడ్యుయేట్ పోస్టులు- ఖాళీలు:

ట్రాఫిక్ అసిస్టెంట్-88
గూడ్స్ గార్డ్-5748

సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్-5638

అర్హత: పై పోస్టులన్నింటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-2873
జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-3164
సీనియర్ టైం కీపర్-14
అర్హత: పై అన్ని పోస్టులకు డిగ్రీతోపాటు ఇంగ్లిష్/హిందీలో కంప్యూటర్ పై టైపింగ్‌లో ప్రావీణ్యత ఉండాలి.

కమర్షియల్ అప్రెంటిస్-259

స్టేషన్ మాస్టర్-6865

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
నోట్: వయస్సు: అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-33 ఏండ్ల మధ్య ఉండాలి.
రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ముఖ్యతేదీలు:
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 31
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఏప్రిల్ 5
మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- జూన్-సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్ చూడవచ్చు.

రైల్వేలో 1937 పారామెడికల్ పోస్టులు

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డలలో 1937 ఖాళీల కోసం నోటిఫికేషన్ వచ్చింది.
పోస్టులు-ఖాళీలు:
డైటీషియన్-4, స్టాఫ్‌నర్స్-1109, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్-289, ఫార్మసిస్ట్-277 తదితర పోస్టులు ఉన్నాయి.
సికింద్రాబాద్ రైల్వే బోర్డులో 112 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 2
కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్: జూన్‌లో ఉంటుంది.

మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ స్టాఫ్ 1665 కొలువులు

రైల్వే బోర్డుల్లో మినిస్టీరియల్,ఐసోలేటెడ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, కుక్, హెడ్‌కుక్, ఫొటోగ్రాఫర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, టీజీటీ, పీజీటీ, డ్యాన్స్, మ్యూజిక్ టీచర్లు తదితరాలు ఉన్నాయి. సికింద్రాబాద్ బోర్డులో 95 ఖాళీలు ఉన్నాయి.
వయస్సు: 18-45 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 7
సీబీటీ తేదీ: జూన్/జూలైలో ఉంటుంది.
నోట్: 1.30 లక్షల పోస్టుల్లో పై ప్రకటనలు విడుదలైనవి.మిగిలిన పోస్టుల ప్రకటనలు వారం పదిరోజుల్లో విడుదల కానున్నాయి.

– కేశవ

ఈ విలువైన స‌మాచారం మీకు ఉప‌యోగం ఉన్నా లేక‌పోయిన‌ మీ మిత్రుల‌కు, బంధువుల‌కు ఏవ‌రికైనా ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు ద‌య‌చేసి షేర్ చేయండి

Read more RELATED
Recommended to you

Exit mobile version