గుడ్ న్యూస్.. ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకూ గుడ్ న్యూస్. భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM), అహ్మదాబాద్‌ పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌ అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. సెంటర్‌ ఫర్ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌, కమ్యూనికేషన్, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, మార్కెటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు. శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.31,000 ల నుంచి రూ.43,000 ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపిక విధానం గురించి చూస్తే.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పనిలో అనుభవం కూడా ఉండాలి. అప్లై చెయ్యడానికి మార్చి 15, 2022 చివరి తేదీ. https://www.iima.ac.in/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news