రష్యా- ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించిన లిథువేనియా దేశం

-

రష్యా- ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో వాటికి సరిహద్దు దేశాల్లో కూడా ఆందోళన నెలకొంది. రెండు దేశాల మధ్య తీవ్రస్థాయి యుద్ధంతో యూరేషియా ప్రాంతంలో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. రష్యా దాడి చేసే ఒక రోజు ముందు ఉక్రెయిన్ జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పుడు ఉక్రెయన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ తో సరిహద్దు పంచుకుంటున్న మరోదేశం లిథువేనియాలో కూడా అత్యవసర పరిస్థితిని విధించారు. లిథువేనియా అత్యవసర పరిస్థితిని ప్రకటించిస్తూ… ఆ దేశ అధ్యక్షుడు గిటానాస్ నౌసేదా నిర్ణయం తీసుకున్నారు. 

మరోవైపు ఉక్రెయిన్, రష్యాలకు సరిహద్దుల్లో ఉన్న దేశాలు కొన్ని రష్యాకు మద్దతు ప్రకటిస్తుంటే.. మరి కొన్ని ఉక్రెయిన్ మద్దతు ప్రకటిస్తున్నాయి. బెలారస్, క్రిమియా వంటి దేశాలు రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్ పై విరుచుకు పడుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కు ఫ్రాన్స్, అమెరికా, నాటో దేశాల మద్దతు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి సహాయం అందలేదు. మరోవైపు ఉక్రెయిన్, రష్యా సరిహద్దు దేశం లాత్వియాకు అమెరికన్ ఆర్మీ చేరకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ దేశానికి 40 ట్రూప్ సైన్యం చేరుకుంది. అయితే వీరంతా వైట్ హౌజ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news