నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో గ్రూస్‌ సీ ఉద్యోగాలు… వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. నార్త్‌ సెంట్రల్‌ రైల్వే వేరు వేరు పోస్టులని భర్తీ చెయ్యడానికి జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ప్రయాగ్‌ రాజ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

Indian-Railways
Indian-Railways

స్పోర్ట్స్ కోటా లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనిలో మొత్తం 21 గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీలు వున్నాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, హాకీ, పవర్‌ లిఫ్టింగ్, టెన్నిస్ క్రీడలలో ప్రావీణ్యం ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

2022 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అర్హులు. ఒలింపిక్‌ గేమ్స్‌/వరల్డ్‌ కప్‌/ఏసియన్‌ గేమ్స్‌/చాంపియన్స్‌ ట్రోఫీ/ తత్సమాన స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.rrcpryj.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.