దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత మూడు నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య డబుల్ అయింది. ఇప్పటికే మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాలు ఓమిక్రాన్ తో అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. ఓమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ వెల్లడించారు. ప్రస్తుతం అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో తగిన మొత్తంలో కరోనా వ్యాక్సినేషన్ డోసులు ఉన్నాయని వెల్లడించారు. వాటి వద్ద 17 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఇండియాలో నెలకు 31 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని.. రాబోయే రెండు నెలల్లో 45 కోట్ల డోెసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి కానున్నట్లు వెల్లడించారు.
దేశంలో త్వరలోనే పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో 88 శాతం మందికి మొదటి డోస్ కరోనా వ్యాక్సినేషన్ అందించామని.. 58 శాతం మంది ప్రజలకు రెండో డోసు కూడా ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.