IBPS PO Recruitment 2021: ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? బ్యాంకు ఉద్యోగం మీ కలా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఐబీపీఎస్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో మొత్తం 4,135 పీఓ పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి అర్హత ఉన్న వాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అక్టోబరు 20 నుండి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 10 లోగా అప్లై చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 4 నుండి 11 తారీకుల్లో ఉంటుంది. ప్రిలిమ్స్ లో పాస్ అయిన వాళ్లు మెయిన్స్ ఎగ్జామ్ కి అర్హులు. మెయిన్స్ పరీక్ష జనవరి 2022 న ఉంటుంది.

ఫిబ్రవరి లేదా మార్చి 2022 లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇక అర్హత విషయంలోకి వస్తే… గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. వయసు వచ్చేసి 20 నుండి 30 వరకు ఉన్నట్లు ఉండాలి. అక్టోబర్ 2, 1991 కంటే ముందు జన్మించిన వాళ్లు అర్హులు కాదు.

అదే విధంగా అక్టోబర్ 1, 2001 తర్వాత జన్మించిన వాళ్లు కూడా అర్హులు కారు. ఆన్లైన్ మోడ్ లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫీజు వచ్చేసి రూ.850. ఎస్సీ, ఎస్టీ, PWBD కి రూ.175. అఫీషియల్ ఐబీపీఎస్ సైట్ లో పూర్తి వివరాలు మీరు చూసి తెలుసుకోచ్చు. https://ibpsonline.ibps.in/crppo11jul21/ ద్వారా అప్లై చెయ్యండి.

విజ‌య‌ప‌థం తో విజ‌య‌కేత‌నం సివిల్స్ మొదలు చిన్న ఉద్యోగం వరకు వివిధ రకాల పోటీ పరీక్షలకు అవసరమైన సమగ్ర సమాచారం అందిస్తుంది విజ‌య‌ప‌థం. manalokam.com ప్రాక్టీస్ బిట్స్‌, ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ప్ర‌త్యేకం,కెరీర్ గైడెన్స్ పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌, జనరల్ నాలెడ్జ్‌, కరెంట్ అఫైర్స్‌ అంశాలు, జనరల్ నాలెడ్జ్‌, కరెంట్ అఫైర్స్‌ అంశాలు, విశ్లేషణలు, అన్ని రకాల కామన్ ఎంట్రన్స్ టెస్టులకు vijayapatham.com ద్వారా ప్రిపేర్ అవ్వ‌చ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news