ఇండియన్ నేవీ లో ఖాళీలు.. ఇలా అప్లై చెయ్యండి..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ(Indian Navy)లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

మ్యాట్రిక్ రిక్రూట్ అక్టోబర్ 2021 బ్యాచ్ కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ పోస్టులకి పెళ్లి కాని పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి. దీనిలో మొత్తం 350 సెయిలర్ పోస్టులున్నాయి. శిక్షణ విజయవంతమైనవారిని నియమించుకుంటారు. అప్లై చేయడానికి 2021 జూలై 23 చివరి తేదీ.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అవ్వాలి. ఐఎన్ఎస్ చిల్కాలో 14 వారాల బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. 17 నుంచి 20 ఏళ్లు. 2001 ఏప్రిల్ 1 నుంచి 2004 సెప్టెంబర్ 30 మధ్య జన్మించిన వారికి అవకాశం ఉంటుంది.

నెలకు రూ.14,000. శిక్షణ పూర్తైన తర్వాత డిఫెన్స్ పే మ్యాట్రిక్స్‌లో లెవెల్ 3 వర్తిస్తుంది. బేసిక్ వేతనం రూ.21,700 ఉంటుంది. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మొత్తం 1750 అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కు పిలుస్తారు.

కటాఫ్ మార్క్స్ వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.