నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. నవరత్న సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో 675 అప్రెంటీస్ ఖాళీల ఇలా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు అప్రెంటీస్‌గా నియామకం చేపట్టనుంది. ఆ తర్వాత సంస్థ అవసరాలను బట్టి అప్రెంటీస్ వ్యవధిని పొడిగిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 8766, రూ. 10,019, రూ.12,524 నెలవారీ స్టైఫండ్‌ను అందజేస్తారు.
అభ్యర్థులు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. వీరితో పాటు బీకామ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఎస్సీ, బీసీఏ, బీబీఏ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు 2019, 2020, 2021 సంవత్సరాల్లో కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం అకడమిక్ మార్కులను బట్టి ఎంపిక విధానం ఉంటుంది.
ఖాళీల వివరాలు..
ఫిట్టర్ – 90, మెకానిక్ (మోటార్ వెహికల్) – 95, ఎలక్ట్రీషియన్ – 90, వైర్‌మెన్ – 90, టర్నర్ – 35, డీజిల్ మెకానిక్ – 5, ట్రాక్టర్ మెకానిక్ – 5, కార్పెంటర్ – 5, ప్లంబర్ – 5, వెల్డర్ – 90, పీఏఎస్‌ఏఏ – 30, అకౌంటెంట్ – 40, డేటా ఎంట్రీ ఆపరేటర్ – 40, అసిస్టెంట్ (హెచ్‌ఆర్) – 40,స్టెనోగ్రాఫర్ – 15.
దరఖాస్తు చేసుకునే విధానం..
అభ్యర్థులు ఎన్‌ఎల్‌సీ అధికారిక వెబ్‌సైట్ www.nlcindia.in ద్వారా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 ఆగస్టు 25 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కాపీ ప్రింటవుట్‌తో పాటు సంబంధిత అకడమిక్ డాక్యుమెంట్లను జతచేసి ఆగస్టు 30 లోపు పోస్ట్ ద్వారా ఎన్ ఎల్‌సికి పంపించాల్సి ఉంటుంది. అకాడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.