డీఆర్డీఓ సీహెచ్ఈఎస్ఎస్ హైద‌రాబాద్‌లో ఖాళీలు..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. డీఆర్డిఓ లో చెందిన సెంట‌ర్ ఫ‌ర్ హై ఎన‌ర్జీ సిస్ట‌మ్ అండ్ సైన్స్ కొన్ని పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత ఉంటే అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ విభాగాల్లో 08 రీసెర్చె అసోసియేట్‌, జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

 

jobs
jobs

ద‌ర‌ఖాస్తుకు చివరి తేదీ అక్టోబ‌ర్ 28, 2021. దీనిలో సెలెక్ట్ అయినా వాళ్ళు సీహెచ్ఈఎస్ఎస్ (CHESS) కార్యాల‌యం హైద‌రాబాద్‌లో ఉద్యోగం చెయ్యాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు జీతం రూ.54,000 అందించ‌నున్నారు. ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే గేట్‌, నెట్ స్కోర్ ఉండాలి. అలానే జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలో చేస్తున్న వ్య‌క్తి నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా పీహెచ్‌డీ (Phd) చేయ‌వ‌చ్చు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఆర్ఏ (ఫిజిక్స్‌) 01, ఆర్ఏ (ఫిజిక్స్‌) 01, జేఆర్ఎఫ్ 05, జేఆర్ఎఫ్ మెకానిక‌ల్‌ 01.

వ‌య‌సు 35 ఏళ్లు మించ‌రాదు గమనించండి. అభ్య‌ర్థి అక‌డ‌మిక్ మెరిట్‌, వృత్తి అనుభ‌వం ద్వారా ఎంపిక చేస్తారు. అలానే షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థిని ఆన్లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వైబ్‌సైట్‌ https://www.drdo.gov.in/careers లో చూసి అప్లై చేసుకోండి.