ఆర్ఐటీఈఎస్‌లో కాంట్రాక్టు పోస్టులు.. ఇలా అప్లై చెయ్యండి..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. RITES ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. RITES రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా 22 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థి సంవ‌త్స‌రం పాటు కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే వర్క్ ని బట్టి మ‌రో సంత్స‌రం పొడ‌గించే అవ‌కాశం ఉంది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే..

 

jobs
jobs

క్వాలిటీ కంట్రోలర్/ మెటీరియల్ ఇంజనీర్ పోస్టుకి అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలానే 10 సంవత్సరాల అనుభ‌వం ఉండాలి. అయితే ఇవి మొత్తం 14 ఖాళీలు వున్నాయి. అలానే ఎస్‌హెచ్ఈ ఎక్స్‌ప‌ర్ట్‌ పోస్టుల అయితే అయారు వున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సేఫ్టీ ఇంజనీరింగ్ లేదా MA లేదా MSc లో గ్రాడ్యుయేట్ చేసి ఉండ‌డంతో పాటు ప‌ది సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉండాలి.

ఇక ప్లానింగ్ ఇంజనీర్ పోస్టుకి అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌తో పాటు మొత్తం పది సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇవి రెండు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఒప్పందం ప్ర‌కారం ఉద్యోగి కి రూ.50,000 జీతం అందిస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 3, 2021 వ‌ర‌కు అవ‌కాశం వుంది. కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ లింక్: https://www.rites.com/Upload/Career/UT-GC13_pdf-2021-Sep-13-14-55-8.pdf