కేంద్ర ప్రభుత్వ సంస్థ లో 242 ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

jobs
jobs

మొత్తం 242 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇది ఇలా ఉంటే ఆన్‌లైన్‌ విధానంలో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 29 లోగా ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, టర్నర్‌ / మెషినిస్ట్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెకానిక్‌ డీజిల్‌ వంటి ట్రేడుల్లో పలు ఖాళీలు ఉన్నాయి.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణత ఉండాలి. ఇది ఇలా ఉంటే వయస్సు వచ్చేసి అక్టోబరు 21 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అలానే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఐటీఐ లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్థులు http://www.ucil.gov.in/ వెబ్‌సైట్‌ ని చూసి ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news