నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు…వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్‌ టెక్నాలజీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

jobs
jobs

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇందులో మొత్తం 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలని భర్తీ చేస్తోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఇక వయస్సు విషయానికి వస్తే.. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోచ్చు.

సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ పాసైన వాళ్లు అర్హులు. టీచింగ్, పరిశోధన అనుభవం ఉన్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోచ్చు. రాతపరీక్షలో పాస్ అయితే ప్రజంటేషన్, క్లాస్ రూం లెక్చర్ కు ఎంపిక చేయడం జరుగుతుంది.

ఇందులోనూ పాస్ అయిన వాళ్లకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.56,100+ నిబంధనల ప్రకారం ఆలవెన్సులు లభిస్తాయి. https://nift.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను చూడచ్చు. రిజిస్ట్రార్‌ కార్యాలయం, హెడ్‌ ఆఫీస్, నిఫ్ట్‌ క్యాంపస్, హజ్‌ఖాస్, న్యూఢిల్లీ–110016 అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Latest news